మన దేశంలో వ్యాక్సిన్ తయారీ తగిన స్థాయిలో లేదు: మోదీకి మమతా బెనర్జీ లేఖ

12-05-2021 Wed 21:59
  • అంతర్జాతీయంగా వ్యాక్సిన్ తయారీదారులు ఎందరో ఉన్నారు
  • వారి సహకారం తీసుకోవాలి
  • టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలి
Vaccine production is not up to the mark says Mamata Banerjee

పశ్చిమబెంగాల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత అక్కడ కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత మండిపడ్డారు. తమకు అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు అవసరమైన అన్నింటినీ సమకూరుస్తామని... తమకు వ్యాక్సిన్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మోదీకి లేఖ రాశారు.

టీకాల ఉత్పత్తికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ప్రోత్సహించాలని చెప్పారు. మన దేశంలో వ్యాక్సిన్ తయారీ తగిన స్థాయిలో లేదని అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఎంతోమంది వ్యాక్సిన్ తయారీదారులు ఉన్నారని... వారి సహకారం తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తయారీదారులను గుర్తించి... టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ దారులకు అన్ని విధాలా సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.