కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని 

12-05-2021 Wed 21:34
  • ఇటీవల కరోనా బారిన పడిన తమ్మినేని దంపతులు
  • కరోనా కష్ట కాలంలో రాజకీయాలు వద్దన్న స్పీకర్ 
  • ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని సూచన
Tammineni Sitaram recovered from Corona

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. చికిత్స అనంతరం సంపూర్థ ఆరోగ్యవంతులు అయిన వీరిద్దరూ ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఒక స్పీకర్ గా ఉన్న తనకు ఎలాంటి వైద్యం అందించారో... ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుంటున్న వారికి కూడా అదే చికిత్సను అందిస్తున్నారని కొనియాడారు. ఇక కరోనా కష్టకాలంలో రాజకీయాలు చేయడం సరికాదని తమ్మినేని అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్లో ధైర్యం నింపాలే కానీ... వారిని భయాందోళనలకు గురి చేయడం సరికాదని చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.