Supreme Court: నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కింద హౌస్ అరెస్ట్ చేయొచ్చు: సుప్రీంకోర్టు

  • దేశంలోని జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి
  • ప్రభుత్వాలకు భారీగా ఖర్చు అవుతోంది
  • అందుకే ఈ సూచన చేశాం
House arrest can be used as judicial custody says Supreme Court

కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీ పేరిట జైలుకి పంపుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా హౌస్ అరెస్ట్ చేయొచ్చని తెలిపింది.

దేశంలోని జైళ్లు కిక్కిరిసిపోతున్నాయని... జైళ్లను ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్వహిస్తున్నారని చెప్పింది. ప్రతి ఏటా జైళ్ల నిర్వహణ కోసం రూ. 6,818.1 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారని తెలిపింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్ట్ లు చేయాలని సూచిస్తున్నామని జస్టిస్ లలిత్, జస్టిస్ జోసెఫ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

అయితే నిందితులను హౌస్ అరెస్ట్ చేయడానికి వారి వయసు, ఆరోగ్యం, వారు చేసిన నేర తీవ్రత తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, విచారణల తర్వాత ఏం చేయాలనే విషయాన్ని న్యాయ వ్యవస్థకు వదిలేయాలని చెప్పింది. జైళ్లు కిక్కిరిసి పోతున్నాయని, ప్రభుత్వాలకు ఖర్చు ఎక్కువవుతోందని... అందుకే ఈ సూచన చేశామని తెలిపింది.

More Telugu News