కలకడ శ్యామ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన జగన్

12-05-2021 Wed 19:50
  • వైసీపీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ మృతి
  • బెంగళూరులో ఉన్న కుటుంబసభ్యులకు జగన్ ఫోన్
  • శ్యామ్ భార్యకు ధైర్యం చెప్పిన జగన్
Jagan pays condolences to Kalakada Shyam

వైసీపీ నేత, రాష్ట్ర పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు. బెంగుళూరులో ఉన్న శ్యామ్ కుటుంబసభ్యులకు జగన్ ఫోన్ చేశారు. శ్యామ్ భార్య సుప్రియకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకలాపాల్లో శ్యామ్ చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు. వైసీపీ ఐటీ, సోషల్ మీడియాలో తనదైన పాత్రను నిర్వహించారు.