రజనీతో మంచు లక్ష్మి ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్

12-05-2021 Wed 19:22
  • హైదరాబాదులో షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీ చిత్రం 'అన్నాత్తే'
  • ఈరోజుతో పూర్తైన 35 రోజుల షూటింగ్ షెడ్యూల్
  • మోహన్ బాబు ఇంటికి రజనీ వెళ్లినట్టు సమాచారం
Lakshmi Manchu photo with Rajinikanth going viral

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను షేర్ చేసిన గంట వ్యవధిలోనే దాదాపు 14 వేల లైకులు వచ్చాయి. ఈరోజు మోహన్ బాబు ఇంటికి రజనీకాంత్ వెళ్లినట్టు తెలుస్తోంది. రజనీ తాజా చిత్రం 'అన్నాత్తే' హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల షెడ్యూల్ ఈరోజుతో పూర్తైంది. షూటింగ్ ముగిసిన వెంటనే తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి రజనీ వెళ్లినట్టు స్పష్టమవుతోంది. అనంతరం రజనీ చెన్నైకి వెళ్లిపోయారు.

'అన్నాత్తే' చిత్రాన్ని దర్శకుడు సిరుతై శివ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.