తెలంగాణ‌లో దుమ్మురేపిన మద్యం అమ్మకాలు!

12-05-2021 Wed 18:58
  • లాక్ డౌన్ ప్రకటనతో నిన్న కిటకిటలాడిన వైన్ షాపులు
  • నిన్న ఒక్కరోజే రూ. 125 కోట్ల అమ్మకాలు
  • ఈరోజు రూ. 94 కోట్ల మేర బిజినెస్
Rs 125 cr of liquor sales in Telangana in a single day

తెలంగాణలో నిన్నటి మద్యం అమ్మకాలు దుమ్మురేపాయి. పది రోజుల పాటు లాక్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే... మద్యపాన ప్రియులు వైన్ షాపులకు పరుగులు పెట్టారు. ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే వైన్ షాపులు కస్టమర్లతో పోటెత్తాయి.

నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఏకంగా రూ. 125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఏ రేంజ్ లో బిజినెస్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా అమ్మకాలు భారీగానే జరిగాయి. రూ. 94 కోట్ల మేర ఈరోజు బిజినెస్ జరిగింది. మరోవైపు ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 770 కోట్ల అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది.