Black Fungus: మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

  • ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు
  • దీని బారిన పడిన వారిలో 50 శాతం మంది మృతి
  • లక్ష ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లకు టెండర్లను పిలిచిన మహా ప్రభుత్వం
Black Fungus cases raises in Maharashtra

మహారాష్ట్రను కరోనా వైరస్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో... మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు.

బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని... అయితే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆరోగ్యమంత్రి చెప్పారు. మహాత్మా పూలే జన్ ఆరోగ్య యోజన కింద చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాధి చికిత్స కోసం ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లు అవసరమవుతాయని... ముందు జాగ్రత్త చర్యలో భాగంగా లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిచామని చెప్పారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News