ఎన్టీఆర్ కి జంటగా కియారా అద్వాని ఖరారైనట్టే!

12-05-2021 Wed 18:33
  • 'ఆచార్య' పనుల్లో కొరటాల
  • నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో
  • స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్
  • రష్మికకు ఛాన్స్ లేనట్టే  
Ntr pairing with Kaira Advani

ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న 'ఆచార్య' .. చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయిన తరువాతనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఇంతవరకూ ఎన్టీఆర్ ఈ తరహా పాత్రను చేయలేదని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉండటం వలన, ఈ సినిమా కోసం కియారా అద్వానిని గానీ .. రష్మికనుగాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 'భరత్ అనే నేను'తో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన సంప్రదిస్తే ఆమె కాదనకపోవచ్చనే టాక్ వినిపించింది. అందుకే ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఆమెనే ఖరారైనట్టుగా ఒక వార్త కూడా షికారు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.