Nani: నాని డిటెక్టివ్ గా కనిపిస్తాడట!

Nani s a detective in Shyam Singha Roy
  • విడుదలకి సిద్ధంగా 'టక్ జగదీష్'
  • షూటింగు దశలో 'శ్యామ్ సింగ రాయ్'
  • ప్రత్యేక ఆకర్షణగా ముగ్గురు కథానాయికలు
  • సంగీత దర్శకుడిగా మిక్కీజె.మేయర్    
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. కోల్ కతా నేపథ్యంలో సాగే కథ ఇది. కాలంలో కాస్త వెనక్కి వెళ్లి అక్కడి వాతావరణంలో కొంత కథ నడుస్తుంది. అందువలన కొంత చిత్రీకరణను అక్కడ చేసి, ఆ తరువాత హైదరాబాద్ పరిసరాల్లో పది ఎకరాల్లో వేసిన సెట్లో షూటింగును జరుపుతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లో నాని లుక్ చూసినవాళ్లు, 'కాలాపాని' .. 'భారతీయుడు' తరహా సినిమాల్లోని పోరాట వీరులను ఊహించుకున్నారు. కానీ ఇది హాస్యప్రధానంగా సాగే కథ అని తెలుస్తోంది.

కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ సినిమాలో 'డిటెక్టివ్' పాత్రలో నాని కనిపించనున్నాడని అంటున్నారు. కథలో సాయిపల్లవి ప్రధాన నాయిక అయినప్పటికీ, తెరపై నాని చేసే సందడి కృతి శెట్టితోనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక మడోన్నా సెబాష్టియన్ పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ నాని చేసిన 'టక్ జగదీష్' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమాకి మిక్కీ.జె మేయర్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Nani
Sai Pallavi
Kruthi Shetty

More Telugu News