హిందీ 'ఛత్రపతి'కి నో చెప్పేసిన సాయిపల్లవి!

12-05-2021 Wed 17:25
  • సాయిపల్లవికి మంచి క్రేజ్
  • వరుస సినిమాలతో ఫుల్ బిజీ
  • 'ఛత్రపతి' రీమేక్ కోసం సంప్రదింపులు
  • డేట్లు లేవని చెప్పినట్టుగా టాక్    
Sai Pallavi rejects the offer of Chatrapathi Bollywood remake

సాయిపల్లవి .. ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, తెలుగులోనే సాయిపల్లవి వరుస సినిమాలు చేస్తోంది. కథలో కొత్తదనం .. తన పాత్రలో వైవిధ్యం ఉంటేనే తప్ప సాయిపల్లవి ఏ సినిమాను ఒప్పుకోదు. చేసే ప్రతి సినిమా తనకి మంచి పేరు తెచ్చేదిగా .. మరిన్ని అవకాశాలను తెచ్చేదిగా ఉండాలని సాయిపల్లవి భావిస్తుంది. తను చేసే ప్రాజెక్టు చిన్నదా .. పెద్దదా? అనే విషయం కంటే, కంటెంట్ ఏమిటనే విషయంపైనే ఆమె ఎక్కువ దృష్టి పెడుతుంది.

అలాంటి సాయిపల్లవి ఈ సారి కంటెంట్ గురించి కాకుండా, తాను బిజీగా ఉండటం వలన ఒక ప్రాజెక్టును తిరస్కరించింది .. అది హిందీ ప్రాజెక్టు .. 'ఛత్రపతి' రీమేక్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ఓ పట్టాన హీరోయిన్ సెట్ కావడం లేదు. సాయిపల్లవిని కూడా అడిగారట. అయితే వరుస సినిమాల కారణంగా డేట్స్ ఇవ్వలేనని చెప్పినట్టుగా సమాచారం. సాయిపల్లవి చేసిన 'లవ్ స్టోరీ' .. 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉండగా, 'శ్యామ్ సింగ రాయ్' సెట్స్ పై ఉంది.