బంధుత్వాన్ని ఉపయోగించి చంద్రబాబు వ్యాక్సిన్లు తెప్పిస్తే మాకు అభ్యంతరం లేదు: ఆళ్ల నాని

12-05-2021 Wed 17:15
  • వ్యాక్సిన్ల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు 
  • వ్యాక్సిన్ల కోసం రూ. 1600 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడం
  • ఒకే రోజు 6 లక్షల డోసులు వేసిన ఘనత మా ప్రభుత్వానిది
Ready to spend 1600 cr for vaccines says Alla Nani

భారత్ బయోటెక్ ఎండీతో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాక్సిన్లు తెప్పించినా తమకు అభ్యంతరం లేదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాక్సిన్ కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు జనాలను భయపెట్టేలా ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ మొత్తం ఉచితంగానే జరగాలనేది సీఎం జగన్ అభిమతమని... దీని కోసం రూ. 1600 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడబోమని అన్నారు. కేంద్రం ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకే రోజు 6 లక్షల డోసులు వేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని అన్నారు.