భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కరోనాతో మృతి

12-05-2021 Wed 16:57
  • ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ మృతి
  • కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడని తెలిపిన ఆర్పీ
  • సంతాపం తెలిపిన పలువురు క్రికెటర్లు
Ex cricketer RP Singhs father dies with Corona

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా పంజా విసురుతోంది. ఇప్పటికే  ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ కరోనా బారిన పడి మృతి చెందారు.

ఈ విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన తండ్రి చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నానని ఆర్పీ సింగ్ చెప్పాడు. కరోనాతో పోరాటం చేస్తూ ఈరోజు తుదిశ్వాస విడిచారని తెలిపాడు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అందరినీ కోరుతున్నానని చెప్పాడు.

మరోపక్క, ఆర్పీ సింగ్ తండ్రి మృతి పట్ల పలువురు క్రికెట్లరు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎంతో బాధ కలుగుతోందని సురేశ్ రైనా అన్నాడు. ఈ కష్ట కాలంలో ధైర్యంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హెర్షలే గిబ్జ్ ధైర్యం చెప్పాడు.