ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్న దర్శకుడు!

12-05-2021 Wed 16:33
  • ముగింపు దశలో ప్రభాస్ 'రాధేశ్యామ్' 
  • సెట్స్ పై ఇప్పటికే 'సలార్.. 'ఆదిపురుష్'
  • త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా
  • కథను సిద్ధం చేస్తున్న చంద్రశేఖర్ యేలేటి  
Chandrashekhar Yeleti preparing a story for Prabhas

ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఓపక్క ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' ముగింపు దశలో ఉండగా.. మరోపక్క రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'.. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' ప్రస్తుతం షూటింగు దశలో వున్నాయి. ఇంకోపక్క, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇప్పటికే మరో చిత్రాన్ని ప్రభాస్ అంగీకరించాడు. ఇది త్వరలోనే సెట్స్ కి వెళుతుంది.

ఇదిలావుంచితే, ప్రభాస్ తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ స్థాయికి తగ్గా పాన్ ఇండియా లెవెల్ కథను ప్రస్తుతం ఆయన తయారుచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇది పూర్తవగానే ప్రభాస్ కి వినిపించి, గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాగా, ఇటీవల నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'చెక్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.