కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను: చిరంజీవి

12-05-2021 Wed 15:06
  • తారక్ ఉత్సాహంగా ఉన్నాడు
  • ఆయన కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు
  • త్వరలోనే తారక్ కోలుకుంటాడు
Spoke to Junior NTR says Chiranjeevi

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. తారక్ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

 కాసేపటి క్రితం తారక్ తో తాను ఫోన్ లో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. తారక్ ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తారక్ ఉత్సాహంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆనందంగా అనిపించిందని చెప్పారు. త్వరలోనే తారక్ పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నానని అన్నారు. గాడ్ బ్లెస్ తారక్ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం తారక్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో తారక్ నటించనున్నాడు. మరోవైపు, టాలీవుడ్ అగ్రహీరోలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.