నర్సులకు 2 నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలి: నాదెండ్ల మనోహర్

12-05-2021 Wed 14:38
  • కరోనా సమయంలో నర్సులు నిర్వర్తిస్తున్న విధులు చాలా గొప్పవి
  • రోగులను కుటుంబసభ్యులుగా భావించి సేవలు చేస్తున్నారు
  • వారికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలి
Nurses should be given 2 months additional salary says Nadendla Manohar

కరోనా సమయంలో నర్సులు నిర్వర్తిస్తున్న విధులు చాలా గొప్పవని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. తమ ఆసుపత్రుల్లో ఉన్న కరోనా రోగులకు వారు ఎంతో కరుణతో సేవ చేస్తున్నారని కొనియాడారు. సిస్టర్ అని పిలవగానే వారిని కుటుంబసభ్యులుగా భావించి, సేవ చేస్తారని చెప్పారు. కోవిడ్ వార్డుల్లో ఎంతో సాహసంతో పని చేస్తున్నారని అన్నారు.

వారిని ప్రత్యేకంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి సేవలకు గుర్తింపుగా, వారిని ప్రోత్సహించేలా రెండు నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.