20 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

12-05-2021 Wed 13:35
  • ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్?
  • బీఏసీలో సమావేశాల రోజుల నిర్ణయం  
  • పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టనున్న ప్ర‌భుత్వం
ap assembly session begins on may 20

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం దీనిపై నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఈ స‌మావేశాల్లో రాష్ట్ర పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల్సి ఉంది.

క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విష‌యాన్ని  బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. బ‌డ్జెట్ తొలి రోజు గవర్నర్ బిశ్వ‌భూష‌న్ ప్రసంగం ఉంటుంది. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలుపుతాయి. అలాగే, బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణారెడ్డిలకు సంతాపం ప్రకటిస్తారు. త‌ర్వాతి రోజు బ‌డ్జెట్టును ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.