Etela Rajender: రోజుకో నేత‌తో భేటీ అవుతూ ఈట‌ల రాజేంద‌ర్ బిజీ!

etela meets ds
  • ఇప్ప‌టికే  భట్టి విక్ర‌మార్క‌తో భేటీ
  • నేడు ఎంపీ డీఎస్‌తో స‌మావేశం
  • గంట‌న్న‌ర చ‌ర్చించిన వైనం
  • త్వ‌ర‌లోనే భవిష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌క‌ట‌న‌
రోజుకో నేత‌తో భేటీ అవుతూ తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బిజీగా ఉంటున్నారు. ఆయ‌న‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంత‌రం ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించారు.  

ఈ నేప‌థ్యంలో మొద‌ట‌ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలతో చర్చలు జ‌రిపిన ఈట‌ల‌... నిన్న‌ హైద‌రాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. ఈ రోజు ఎంపీ డి.శ్రీనివాస్‌తో ఆయన సమావేశం అయ్యారు.

వీరిద్దరూ దాదాపు గంటన్నరకు పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. త‌న‌ భవిష్యత్తు రాజకీయాలపై ఈట‌ల‌ చర్చించినట్టు తెలుస్తోంది. అక్క‌డే డీఎస్ తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌ను కూడా ఈటల రాజేంద‌ర్ క‌ల‌వడం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఈట‌ల త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
Etela Rajender
DS
Telangana

More Telugu News