హైకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఏపీ నుంచి తెలంగాణ‌లోకి అంబులెన్సులకు అనుమ‌తి

12-05-2021 Wed 12:36
  • సరిహద్దుల్లో రెండు రోజులు అడ్డ‌గింత‌
  • త‌ప్పుబ‌ట్టిన తెలంగాణ హైకోర్టు
  • నేడు అంబులెన్సుల‌కు పోలీసుల అనుమతి  
ts gives permisions for ambulances from ap to hyderabad

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లో క‌రోనా రోగుల‌ అంబులెన్స్‌ల‌ను అడ్డుకుంటోన్న వైనంపై నిన్న తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల పాటు స‌రిహ‌ద్దుల వ‌ద్ద అంబులెన్సుల‌ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు హైకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. ఈ రోజు ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్సుల‌కు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.

కాగా, తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు నిన్న, మొన్న‌ తనిఖీలు చేసి అంబులెన్సుల‌ను అడ్డుకున్న సంగతి విదితమే. ఆయా ఆసుప‌త్రులు త‌మ ల్యాండ్ లైన్ నంబ‌ర్ల నుంచి ఫోను చేసి రోగుల‌ను పంపాల‌ని చెబితేనే వదలడం జరిగింది.