లాక్ డౌన్ సమయంలో చేతిలో డబ్బులేదు.. ఇబ్బంది పడ్డాను: శ్రుతిహాసన్

12-05-2021 Wed 12:28
  • లాక్ డౌన్ కి ముందే ఇల్లు కొన్నాను
  • ఈఎమ్ఐ లు కట్టవలసి ఉంది
  • చేతిలో డబ్బులు లేవు
  • నా అవస్థలు నేను పడ్డాను
Financial Problems for Sruthi Haasan

శ్రుతిహాసన్ తెలుగు.. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసింది. బాలీవుడ్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేందుకుగాను తనవంతు ప్రయత్నం తాను చేసింది. అయితే ఈ మధ్యలోనే 'ప్రేమ' అనే రెండు అక్షరాలు ఆమెను ట్రాక్ తప్పించాయి. దాంతో ఆమె కెరియర్ ను పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ ప్రేమలో నుంచి బయటపడేసరికి, తనే అవకాశాల కోసం కాల్స్ చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. అవకాశాల సంగతి అలా ఉంచితే అమ్మడు బాగానే సంపాదించి ఉంటుందని అనుకోవడం సహజం.

కానీ లాక్ డౌన్ పరిస్థితుల్లో తాను ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డానని శ్రుతి హాసన్ చెబుతోంది. "'లాక్ డౌన్ కి ముందే నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. దానికే కాదు .. మరికొన్నింటికి నేను ఈఎమ్ ఐ లు కట్టవలసి ఉంది. లాక్ డౌన్ సమయంలో చేతిలో డబ్బులేదు. దాంతో ఎప్పుడు ఏ షూటింగును మొదలుపెట్టినా వెళ్లి పనిచేయాలనుకున్నాను. అమ్మానాన్నలను డబ్బు అడగడం మానేసి చాలా కాలమైంది. అందుకే నా అవస్థలు నేను పడ్డాను. నాకంటే ఎక్కువ కష్టాలు పడినవారుంటారనే విషయాన్ని కూడా నేను ఒప్పుకుంటాను" అని చెప్పుకొచ్చింది.