కేసీఆర్‌, జ‌గ‌న్ తీరుపై విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం!

12-05-2021 Wed 11:59
  • వారిద్ద‌రు బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు
  • ఇరు రాష్ట్రాల‌ స‌రిహ‌ద్దుల‌ వ‌ద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి
  • ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాలి
vishnu vardhan slams jagan kcr

క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు బాగోలేద‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. వారిద్ద‌రు బాధ్య‌తారహితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఇరు రాష్ట్రాల‌ స‌రిహ‌ద్దు వ‌ద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయ‌ని కోర్టులు చెప్పినా స్పందించ‌ట్లేద‌ని విమర్శించారు.

తెలంగాణ‌లోకి ఏపీ నుంచి క‌రోనా రోగుల‌తో వ‌చ్చే అంబులెన్స్‌ల‌ను ఎందుకు అనుమ‌తించ‌ట్లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. క‌రోనా స‌మ‌యంలో అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాలని ఆయ‌న అన్నారు. స‌రిహద్దుల‌ వ‌ద్ద నెల‌కొంటున్న ప‌రిస్థితుల‌పై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల డీజీపీలు అధికారికంగా  ఎందుకు ప్ర‌క‌ట‌న‌ చేయ‌డం లేద‌ని ఆయన నిల‌దీశారు.