క‌రోనా నుంచి కోలుకున్నాను: అల్లు అర్జున్

12-05-2021 Wed 11:20
  • 15 రోజుల క్వారంటైన్ తర్వాత నెగెటివ్ నిర్ధార‌ణ
  • ప్రార్థ‌న‌లు చేసిన‌ నా శ్రేయోభిలాషుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు
  • క‌రోనా కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నా
  • సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి
allu arjun tests negetive for corona

యంగ్ హీరో అల్లు అర్జున్‌కు రెండు వారాల క్రితం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకున్నాడు. త‌న‌కు నెగెటివ్ నిర్ధార‌ణ అయిందంటూ బ‌న్నీ ఈ రోజు ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు.  

'ప్రతి ఒక్క‌రికీ హాయ్‌.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయింది. నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన‌ నా శ్రేయోభిలాషుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. క‌రోనా కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. అంద‌రూ సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని బ‌న్నీ ట్వీట్ చేశాడు.