సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి హిందీ సినిమా?
  • 'సలార్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం!
  • షూటింగ్ పూర్తిచేసిన రజనీకాంత్  
Sai Pallavi debut in Bollywood soon

*  కథానాయిక సాయిపల్లవి త్వరలో తొలిసారిగా హిందీ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న 'ఛత్రపతి' రీమేక్ లో కథానాయిక పాత్రకు సాయిపల్లవితో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఏ విషయం త్వరలో తెలుస్తుంది.
*  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో హీరో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా రెండు పాత్రలలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూలు ఇప్పటికే పూర్తయింది.
*  రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. నిన్నటితో రజనీకాంత్ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో ఆయన చెన్నైకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

More Telugu News