WHO: ధనిక దేశాలే వ్యాక్సిన్ డోసుల విషయంలో ముందున్నాయి: డబ్ల్యూహెచ్ఓ

  • ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్
  • పేద దేశాలకు వ్యాక్సిన్ దక్కడంలేదన్న డబ్ల్యూహెచ్ఓ
  • ధనిక దేశాల వ్యాక్సిన్ వాటా 83 శాతం అని వెల్లడి
  • పేద దేశాల వ్యాక్సిన్ వాటా శాతం 17 మాత్రమేనని వివరణ
WHO opines on world corona vaccine program

ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేసస్ విచారం వ్యక్తం చేశారు. సంపన్న దేశాలే వ్యాక్సిన్ డోసుల విషయంలో ముందున్నాయని, వ్యాక్సిన్ ప్రక్రియలో అసమానతలు పేద దేశాలను ఇబ్బందుల పాల్జేస్తాయని పేర్కొన్నారు.

ప్రపంచంలో ధనిక, ఎగువ మధ్య ఆదాయ దేశాల జనాభా శాతం 53 కాగా, ఆయా దేశాల కరోనా వ్యాక్సిన్ వాటా శాతం 83 అని వివరించారు. పేద దేశాల్లో 47 శాతం జనాభా ఉంటే, వ్యాక్సిన్ వాటా శాతం కేవలం 17 మాత్రమేనని అన్నారు. అన్ని దేశాలకు సమాన రీతిలో వ్యాక్సిన్లు అందడంలేదన్న అంశాన్ని ఈ గణాంకాలు ఎత్తిచూపుతున్నాయని టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేసస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సంపన్న దేశాలు చొరవ చూపి, వ్యాక్సిన్ సమానత్వం నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

More Telugu News