Chandrababu: తాజా పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్

  • పార్టీ నేతలతో చంద్రబాబు వర్చువల్ భేటీ
  • ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు   
  • కొవిడ్ పరిస్థితులపై చర్చించాలని సూచన
  • అందరికీ టీకా ఇవ్వాలని స్పష్టీకరణ
Chandrababu demands list to AP Govt

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, తాజా పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు స్పందించారు.

  • కరోనా బాధితులకు ఇస్తున్న సాయం, ఇతర అంశాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
  • ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
  • కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలి.
  • ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
  • కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం చేస్తామన్న సర్కారు, తన మాట నిలుపుకోవాలి.
  • కరోనా మృతులకు గౌరవప్రదంగా ప్రభుత్వమే దహనసంస్కారాలు నిర్వహించాలి.
  •  ఇతర కారణాలతో మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలి.
  • కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలి.
  • కరోనా సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
  • కరోనా ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి.

More Telugu News