Narendra Modi: బ్రిటన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

  • జూన్ లో బ్రిటన్ లో జి-7 దేశాల సదస్సు
  • మోదీకి ప్రత్యేక ఆహ్వానం పంపిన బోరిస్ జాన్సన్
  • భారత్ లో కరోనా ప్రబలం
  • దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ నిర్ణయం
PM Modi cancels his tour of Britain next month

భారత్ లో కరోనా సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బ్రిటన్ పర్యటన రద్దు చేసుకున్నారు. జూన్ లో బ్రిటన్ లోని కార్న్ వాల్ లో జి-7 దేశాల సదస్సు జరగనుండగా,  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సదస్సు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది.

 బ్రిటీష్ ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించడం సంతోషదాయకమే అయినా, భారత్ లో కరోనా ప్రబలంగా ఉన్న దశలో జి-7 దేశాల సమావేశానికి మోదీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత్ లో కరోనా సంక్షోభ నివారణకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.

కాగా, ఈ జి-7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాధినేతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

More Telugu News