రష్యాలో విషాదం... పాఠశాలపై కాల్పులు.. 13 మంది మృతి

11-05-2021 Tue 21:01
  • కజాన్ నగరంలో పాఠశాలపై దుండగుల దాడి
  • తొలుత పేలుడు, ఆపై కాల్పులు
  • మృతుల్లో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్
  • ఇద్దరు దుండగులను కాల్చి చంపిన సైన్యం
Firing at school in Russia

రష్యాలోని కజాన్ నగరంలో ఘోరం జరిగింది. సాయుధ దుండగులు కొందరు ఓ పాఠశాలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు సహా 13 మంది మరణించారు. మృతుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. దుండగుల వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాలలో దుండగులు కాల్పుల నేపథ్యంలో, సైన్యం వెంటనే స్పందించింది. సైన్యం కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమైనట్టు సమాచారం.

తొలుత పేలుడుకు పాల్పడిన దుండగులు, ఆపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షుల కథనం. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అగ్నిప్రమాదం జరిగిందని భావించిన విద్యార్థులు... పై అంతస్తుల నుంచి కిందికి దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలో మరణించినట్టు గుర్తించారు. ఈ కాల్పుల ఘటనకు పాల్పడింది టీనేజర్లు అని భావిస్తున్నారు.