Corona Virus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా క్షీణిస్తోంది: కేంద్ర ఆరోగ్యశాఖ

Union health ministry says corona second wave weakens gradually
  • గత కొన్నినెలలుగా భారత్ లో సెకండ్ వేవ్
  • కొన్నివారాల పాటు పతాకస్థాయిలో కరోనా కేసులు, మరణాలు
  • కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్టు కేంద్రం వెల్లడి
  • కొవిడ్ పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వివరణ
దేశంలో కొన్ని నెలలుగా హడలెత్తిస్తున్న కరోనా సెకండ్ వేవ్ క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని వివరించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 26 రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు సుమారు 15 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా తీవ్రత మేరకు దేశంలో కంటైన్మెంట్ చర్యలు ఉంటాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.

కాగా, మే చివరినాటికి సెకండ్ వేవ్ బలహీన పడుతుందని అంచనా వేస్తుండగా, మూడో వేవ్ వస్తే అది చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా తొలి వేవ్ లో చిన్నారులపై కరోనా ప్రభావం 1 శాతం కంటే తక్కువ కాగా, సెకండ్ వేవ్ లో పిల్లలకు కరోనా సోకే రేటు 10 శాతానికి పెరిగింది. అది థర్డ్ వేవ్ నాటికి 80 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాలు చెందే కొద్దీ కరోనా వైరస్ మరింత శక్తిమంతంగా తయారవుతుండడమే అందుకు కారణమని భావిస్తున్నారు.
Corona Virus
Second Wave
Healh Ministry
India

More Telugu News