తెలంగాణలో మరో 4,801 మందికి కరోనా పాజిటివ్

11-05-2021 Tue 19:05
  • తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
  • గత 24 గంటల్లో 75,289 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 756 కేసులు
  • రాష్ట్రంలో 32 మంది మృతి
  • ఇంకా 60,136 మందికి చికిత్స
Telangana corona health bulletin

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొద్దిమేర అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,801 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 756 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 7,430 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది మృత్యువాత పడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 5,06,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,44,049 మంది కోలుకున్నారు. ఇంకా 60,136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,803కి పెరిగింది.

కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. రికవరీ రేటులోనూ తెలంగాణ మెరుగ్గానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 82.7 శాతం కాగా, తెలంగాణలో అది 87.58 శాతంగా ఉంది.