మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం!

11-05-2021 Tue 17:58
  • రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ 
  • ఉదయం రిలీఫ్ సమయంలో మద్యం షాపులు తెరిచేందుకు నిర్ణయం
  • ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
Liquor shops to be opened during lockdown relief time in Telangana

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మందుబాబులు వైన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. రేపటి నుంచి షాపులు బంద్ అవుతాయనే ఆందోళనలో స్టాక్ పెట్టుకోవడానికి మద్యం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో, వైన్ షాపుల వద్ద భారీ సందడి నెలకొంది.

మరోవైపు, మందుబాబులకు ఊరటనిచ్చే వార్తను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోతోంది. లాక్ డౌన్ రీలీఫ్ సమయంలో (ఉదయం 6 నుంచి 10 గంటల వరకు) మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మౌఖిక ఆదేశాలను జారీ చేసింది. కాసేపట్లో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడబోతోంది. మద్యం షాపులను బంద్ చేస్తే... ఆదాయం పడిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.