హైదరాబాదులో కాంగ్రెస్ నేత భట్టి నివాసానికి వెళ్లిన ఈటల

11-05-2021 Tue 17:27
  • ఈటలపై భూకబ్జా ఆరోపణలు
  •  మంత్రి పదవిని పోగొట్టుకున్న వైనం
  • రాజకీయ భవితవ్యంపై అనుచరులతో చర్చ
  • ఈ మధ్యాహ్నం భట్టితో సమావేశం
Eatala met Bhatti Vikramarka at his house in Hyderabad

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం ఇంకా అనిశ్చితికరంగానే ఉంది. భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోయిన ఈటల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన ఈటల ఆయనతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో, పలు పార్టీలకు చెందిన రాజకీయనేతలను కలిసి చర్చలు జరిపేందుకు ఈటల నిర్ణయించుకున్నారు. ఈ భేటీలు ముగిసిన తర్వాత తన రాజకీయ భవితవ్యంపై త్వరలోనే ఈటల నుంచి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.