బ్యాంకులు పేదల పట్ల సానుభూతి చూపించాలి: మంత్రి పెద్దిరెడ్డి

11-05-2021 Tue 17:05
  • బీమా పథకంపై మంత్రి సమీక్ష
  • అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
  • ఇప్పటిదాకా 62.43 లక్షల మందిని ఎన్ రోల్ చేసినట్టు వెల్లడి
  • ఇంకా 55.53 లక్షల మందిని ఎన్ రోల్ చేయాలని వివరణ
  • బ్యాంకుల వద్దే ఆలస్యం అవుతోందన్న మంత్రి పెద్దిరెడ్డి
Peddireddy video conference over YSR Insurance Scheme

వైఎస్సార్ బీమా పథకంపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునే మంచి పథకం వైఎస్సార్ బీమా పథకం అని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ బీమా పథకం కింద 62.43 లక్షల మందిని నమోదు చేశామని, ఇంకా 55.53 లక్షల మందిని నమోదు చేయాల్సి ఉందని వివరించారు. బ్యాంకుల వద్దే భారీగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని పెద్దిరెడ్డి తెలిపారు. పేదల పట్ల బ్యాంకులు సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.