లాక్ డౌన్ నేపథ్యంలో 'మందు'జాగ్రత్త చర్యలు... వైన్ షాపుల ముందు భారీ క్యూలు

11-05-2021 Tue 16:35
  • తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్
  • రేపటి నుంచి అమలు
  • మద్యం దుకాణాల వేళలపై స్పష్టతలేని వైనం
  • మద్యం దుకాణాలకు పోటెత్తిన మందుబాబులు
  • భౌతికదూరం నిబంధనకు తూట్లు
People rushes to wine shops after lock down announcement in Telangana

రేపటి నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో మందుబాబులు అప్రమత్తం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాల వేళలపై స్పష్టత లేకపోవడంతో ముందే జాగ్రత్తపడుతూ, వైన్ షాపులకు పోటెత్తారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాపు ముందు చూసినా మందుబాబుల రద్దీ కనిపించింది.

హైదరాబాదులోని వైన్ షాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల మేర ఉన్నాయంటే మందుబాబుల ముందుజాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.