కరోనా మృతుడిని రోడ్డుపైనే వదిలేశారు... ఏం మానవత్వం ఇది?: చంద్రబాబు

11-05-2021 Tue 16:19
  • తిరువూరులో కరోనాతో బాధపడుతున్న సుభానీ
  • 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి
  • చనిపోయాడని మధ్యలోనే వదిలేసిన వైనం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • సీఎం ఏం జవాబు చెబుతాడని నిలదీత 
 Chandrababu furious over AP govt

ఓ కరోనా రోగి మృతదేహం రోడ్డుపక్కనే పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.... 108 వాహనాలు కరోనా బాధితులను నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళుతున్నారని, అయితే మధ్యలోనే చనిపోయాడని, మానవత్వం కూడా లేకుండా నడిరోడ్డుపైనే వదిలేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఎంత అమానుషం, ఎంత అనాగరికం? అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.