Karnataka: కర్ణాటకపై కరోనా పంజా.. మహారాష్ట్రను దాటేసిన కొత్త కేసులు!

Karnataka tops in daily Corona cases
  • నిన్న కర్ణాటకలో 39,305 కేసుల నమోదు
  • మహారాష్ట్రలో 37,236 కేసుల నిర్ధారణ
  • ఒక్క బెంగళూరులోనే 16,747 కేసుల నమోదు
కరోనా దెబ్బకు కర్ణాటక విలవిల్లాడుతోంది. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగింది. ఇప్పుడు మహారాష్ట్రను కర్ణాటక అధిగమించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.29 లక్షల కొత్త కేసులు నమోదు కాగా... వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 39,305 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర 37,236 కేసులను నమోదు చేసింది.  

ఒక్క బెంగళూరులోనే నిన్న 16,747 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నగరంలో 374 మంది మృతి చెందారు. ప్రస్తుతం కర్ణాటకలో 9,67,409 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నిన్నటి నుంచి కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. 15 రోజుల లాక్ డౌన్ ను కర్ణాటక ప్రభుత్వం విధించింది.

ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మరోవైపు, తెలంగాణలో కూడా రేపు ఉదయం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రాబోతోంది. కాసేపటి క్రితం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ విధించాలనే నిర్ణయం తీసుకున్నారు.
Karnataka
Corona Virus
Cases
Maharashtra

More Telugu News