వామన్ రావు దంపతుల హత్యతో నాకు సంబంధం లేదు.. వారే హత్య చేసి ఉంటారు: పుట్టా మధు

11-05-2021 Tue 15:09
  • మూడు రోజుల పోలీసు విచారణను ఎదుర్కొన్న మధు
  • నిన్న అర్ధరాత్రి ఇంటికి పంపిన పోలీసులు
  • కుంట శ్రీను, బిట్టు శ్రీనులే హత్య చేసి ఉంటారని వ్యాఖ్య
I dont have contact with Vaman Rao murder says Putta Madhu

హైకోర్టు న్యాయవాదులైన వామన్ రావు దంపతుల హత్య తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు మధును విచారించిన పోలీసులు... నిన్న అర్ధరాత్రి ఆయనను ఇంటికి పంపించారు. మధు భార్యను కూడా పోలీసులు విచారించారు.

తాజాగా పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్ రావు దంపతుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులే ఆ హత్య చేసి ఉంటారని చెప్పారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.