ఏపీకి చేరుకున్న 2 లక్షల డోసుల కోవాగ్జిన్ టీకాలు

11-05-2021 Tue 14:17
  • హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యాక్సిన్లు
  • గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు
  • అక్కడి నుంచి వివిధ జిల్లాలకు పంపిణీ
2 laks doses of Covaxin vaccine reaches AP

ఏపీలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలనుకుంటున్నప్పటికీ... టీకాల కొరత అడ్డంకిగా మారుతోంది. వ్యాక్సిన్లు పంపాలంటూ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు కూడా రాశారు. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 2 లక్షల కోవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి.

వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. మరోవైపు, వ్యాక్సిన్ ను ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.