రుయా ఆసుపత్రి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

11-05-2021 Tue 14:07
  • తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం
  • ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశం
CM Jagan announces ex gratia for Tirupati RUIA hospital victims

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడడం తెలిసిందే. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా కుటుంబాల వద్దకే వెళ్లి పరిహారం అందజేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

గత రాత్రి రుయా ఆసుపత్రిలో ప్రాణవాయువు నిల్వలు అడుగంటిన సమయంలో చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతో ఈ ఘోరం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అంటున్నారు.