Bandi Sanjay: నేటి కేబినెట్ భేటీలో మంచి నిర్ణ‌యం తీసుకోవాలి: బండి సంజ‌య్‌

  • ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు చేయాలి 
  • బ‌కాయిల చెల్లింపుల త‌ర్వాతే క‌రోనాను ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలి
  • వైద్య శాఖ‌లో శాశ్వ‌త ఉద్యోగాల‌ను ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు?
bandi sanjay slams trs

కాసేప‌ట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానున్న నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందిస్తూ స‌ర్కారుకి ప‌లు సూచ‌న‌లు చేశారు. మంత్రి వ‌ర్గ భేటీలో కేసీఆర్ మంచి నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్‌ను అమ‌లు చేయాల‌ని చెప్పారు.

ఇప్ప‌టికే ఉన్న బ‌కాయిల చెల్లింపుల త‌ర్వాతే క‌రోనాను ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలని బండి సంజ‌య్ కోరారు. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం 440 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను కేటాయించిందని, ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర స‌ర్కారు నిధులు ఇచ్చిందని ఆయ‌న అన్నారు. అయిన‌ప్ప‌టికీ వాటిని ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

1,250 వెంటిలేట‌ర్లు ఇస్తే ఎందుకు వినియోగించ‌ట్లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఇప్ప‌టివర‌కు ఒక్క ఐసోలేష‌న్ కేంద్రాన్ని కూడా సంద‌ర్శించ‌లేదని ఆయ‌న అన్నారు. వైద్య శాఖ‌లో శాశ్వ‌త ఉద్యోగాల‌ను ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు? అని ఆయ‌న నిల‌దీశారు.

More Telugu News