Italy: ఇటలీలో యువతికి ఒకేసారి ఆరు డోసుల వ్యాక్సిన్​.. ఆరోగ్య సిబ్బంది నిర్వాకం!

  • ఇటలీలోని టస్కనీలో ఘటన
  • పొరపాటున ఫైజర్ వ్యాక్సిన్ వయల్ మొత్తం సిరంజీలోకి
  • 24 గంటల పాటు పర్యవేక్షణలో యువతి
  • అంతా బాగానే ఉందన్న ఆసుపత్రి
Italy Woman Gets 6 Doses Of Covid Jab at a time

ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ తప్ప మిగతా వ్యాక్సిన్లన్నింటినీ రెండు డోసుల చొప్పున ఇస్తున్నారు. ఒక్కో డోసుకు కనీసం నెల నుంచి నెలన్నర దాకా గ్యాప్ ఇస్తున్నారు. అయితే, ఇటలీలో ఓ యువతికి పొరపాటున ఒకేసారి ఏకంగా ఆరుడోసుల వ్యాక్సిన్ వేశారు. టస్కనీలోని నోవా ఆసుపత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన 23 ఏళ్ల ఆ యువతికి పొరపాటున ఆరు డోసులు వేసినట్టు నోవా ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు.

ఆరు డోసులుండే ఫైజర్ వ్యాక్సిన్ వయల్ మొత్తాన్ని ఆరోగ్య కార్యకర్త సిరంజీలోకి లోడ్ చేశారని, అది పొరపాటుగానే జరిగిందని తెలిపారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత పక్కనే ఇంకా వాడని ఐదు సిరంజీలు ఉండడం, వయల్ ఖాళీ కావడంతో తన పొరపాటును ఆరోగ్య కార్యకర్త గుర్తించడం జరిగింది.

వ్యాక్సిన్ ఓవర్ డోస్ కావడంతో వెంటనే ఆమెను పర్యవేక్షణలో ఉంచామని, 24 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించామని చెప్పారు. ఆరోగ్యం బాగానే ఉండడంతో సోమవారం ఇంటికి పంపించామని తెలిపారు. ఆ యువతి ఆసుపత్రిలోని సైకాలజీ విభాగంలో ఇంటర్న్ అని చెప్పారు. ఇది కావాలని చేసింది కాదని, మానవ తప్పిదమేనని చెప్పారు. ఘటనపై అధికారులు విచారిస్తున్నారు.

More Telugu News