సీక్వెల్ పనిలోపడ్డ 'జాంబిరెడ్డి' డైరెక్టర్!

11-05-2021 Tue 12:17
  • కొత్త కథలకు ప్రాధాన్యత
  • ప్రయోగాల పట్ల ఆసక్తి
  • 'జాంబి రెడ్డి'కి సీక్వెల్
  • త్వరలో సెట్స్ పైకి    
Prashanth Varma Zombie Reddy Movie Sequel

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు ఎంతోమంది యువ దర్శకులు పరిచయమవుతున్నారు. ఎవరికివారు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. 'అ' వంటి తక్కువ బడ్జెట్ సినిమాలను మాత్రమే కాదు, 'కల్కి' వంటి భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కించగలనని ఆయన నిరూపించుకున్నాడు. అంతేకాదు 'జాంబి రెడ్డి' వంటి సినిమాలతో హారర్ సినిమాలు కూడా తీయగలనని చాటి చెప్పాడు.

'జాంబి రెడ్డి' సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రశాంత్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడట. 'జాంబి రెడ్డి'కి మించి ఈ సీక్వెల్ హారర్ తో సాగుతుందని అంటున్నాడు. ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనీ, కరోనా ప్రభావం తగ్గగానే షూటింగు మొదలుకావొచ్చని చెబుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత సమంత ప్రధాన పాత్రధారిగా ఆయన ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.