రెండో ఎక్కం చెప్పలేదట.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన వధువు!

11-05-2021 Tue 12:01
  • యూపీలోని మహోబా జిల్లాలో ఆసక్తికర ఘటన
  • రెండో ఎక్కం చెప్పాలని వరుడిని కోరిన వధువు
  • ఎక్కం చెప్పలేక నోరెళ్లబెట్టిన వరుడు
Bride cancels marriage after bridegroom unable to tell second table

ఎన్నో కారణాల వల్ల పెళ్లిళ్లు రద్దవడం మనం చూస్తూనే ఉంటాం. పెళ్లి పందిరిలో కూడా పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఒక వింత కారణం కారణంగా పెళ్లి ఆగిపోయిన ఆసక్తికర ఘటన జరిగింది. పెళ్లికొడుకు రెండో ఎక్కం చెప్పలేకపోవడంతో... అతన్ని పెళ్లి చేసుకోలేనని పెళ్లికూతురు తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, రంజిత్ అహిర్వార్, మాయకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే ఆయనపై మాయకు అనుమానం వచ్చి... రెండో ఎక్కం చెప్పమని అడిగింది. ఎక్కం చెప్పలేక రంజిత్ నోరెళ్లబెట్టాడు. అంతే, మాయలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెండో ఎక్కం కూడా రాని వ్యక్తి తనకు భర్తగా అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఈ విషయంలో ఆమెకు ఆమె కుటుంబసభ్యులు కూడా మద్దతుగా నిలిచారు. అంతేకాదు, ఇప్పటి వరకు అయిన పెళ్లి ఖర్చును రంజిత్ కుటుంబమే భరించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు మాయ చేసిన పని భేష్ అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.