China: అద్దాల వంతెన నుంచి ఊడిపోయిన అద్దాలు.. 330 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన వ్యక్తి!

  • చైనాలోని లాంగ్జింగ్ లో ఘటన
  • 150 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • సురక్షితంగా తీసుకొచ్చిన బలగాలు
Man Left Dangling From 330 Foot Glass Bridge As Strong Winds Shatter Panels

చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో 330 అడుగుల ఎత్తున రెండంచులను కలిపే అద్దాల వంతెన. దాని మీద నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆ మజాయే వేరు కదా! మజా పక్కన పెడితే.. మన ఖర్మ కాలి ఆ అద్దాలు ఊడిపోయాయనుకోండి.. ఆ గ్యాప్ లో మీరు వేలాడుతున్నారనుకోండి..! ఏంటి పరిస్థితి? ఏముంది గాల్లో వేలాడిన ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి కదా!

అచ్చంగా ఇదే జరిగింది చైనాకు చెందిన ఓ వ్యక్తికి. చైనాలోని లాంగ్జింగ్ లోని పియాన్  మౌంటెయిన్ కల్చరల్ టూరిజం సీనిక్ ఏరియా వద్ద ఉన్న అద్దాల వంతెన వద్ద శుక్రవారం జరిగిందీ ఘటన. ఓ టూరిస్ట్ అద్దాల వంతెనపై నడుస్తుండగా.. అకస్మాత్తుగా గాలి వీచింది. కొద్ది సేపట్లోనే గాలి వేగం 150 కిలోమీటర్లకు పెరిగింది.

ఆ ఈదురుగాలుల ధాటికి వంతెన అద్దాలన్నీ ఊడిపోయాయి. కంగారుపడిపోకుండా ఆ వ్యక్తి వెంటనే సమయస్ఫూర్తితో పక్కలకు పెట్టిన ఇనుప కడ్డీలను పట్టుకున్నాడు. కింద ఏ ఆధారమూ లేకపోవడంతో చాలా సేపు దానిని పట్టుకుని అలాగే వేలాడాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అతడిని కాపాడారు. ఈ ఘటన వివరాలను లాంగ్జింగ్ నగర పాలక సంస్థ చైనా సామాజిక మాధ్యమ సైట్ అయిన వీబోలో పోస్ట్ చేసింది.

More Telugu News