Putta Madhu: ముగిసిన పోలీసుల విచారణ.. ఇంటికి చేరుకున్న పుట్టా మధు!

  • మూడు రోజుల పాటు పుట్టా మధును విచారించిన పోలీసులు
  • నిన్న అర్ధరాత్రి ఇంటికి పంపిన వైనం
  • విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని ఆదేశం
Putta madhu reaches home after police questioning for 3 days

హైకోర్టు న్యాయవాదులైన వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధును పోలీసులు మూడు రోజులపాటు విచారించారు. ఆయనతో పాటు ఆయన భార్య శైలజ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వూదరి సత్యనారాయణను కూడా విచారణలో భాగంగా ప్రశ్నించారు. విచారణ పూర్తి కావడంతో పుట్టా మధును పోలీసులు నిన్న అర్ధరాత్రి ఇంటికి పంపించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఆదేశించారు.

మరోవైపు మూడు రోజుల విచారణలో పోలీసులు అన్ని విషయాలపై ప్రశ్నించారు. ఆయన బ్యాంకు ఖాతాలు, బంధుమిత్రుల ఆస్తి విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వామన్ రావు దంపతుల హత్య జరగడానికి ముందు బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ. 2 కోట్లు ఎవరెవరి చేతులు మారాయనే విషయంపై దృష్టి సారించారు. అయితే, విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు ఇంతవరకు బహిరంగంగా వెల్లడించలేదు.

More Telugu News