మంచు ల‌క్ష్మి 'చిట్టి చిల‌క‌మ్మ' యూట్యూబ్ చానెల్ హ్యాక్!

11-05-2021 Tue 11:04
  • త‌న కూతురు విద్యతో క‌లిసి వీడియోలు రూపొందిస్తున్న ల‌క్ష్మి
  • అందులో అన‌వ‌స‌ర కంటెంట్ వ‌స్తే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సూచ‌న‌
  • చానెల్‌ను తిరిగి స‌రిచేయ‌డానికి త‌మ బృందం ప‌నిచేస్తోంద‌ని ట్వీట్
manchu lakshmi youtube channel hack

సినీ న‌టి మంచు ల‌క్ష్మి ప్రారంభించిన 'చిట్టి చిల‌క‌మ్మ' యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ మంచు ల‌క్ష్మి ట్వీట్ చేసింది. అందులో అర్థ ర‌హిత‌మైన కంటెంట్ క‌న‌ప‌డితే దాన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఆమె కోరింది. యూట్యూబ్ చానెల్‌ను తిరిగి స‌రిచేయ‌డానికి త‌మ బృందం ప‌నిచేస్తోంద‌ని తెలిపింది.

'చిట్టి చిల‌క‌మ్మ'  యూ ట్యూబ్ చానెల్‌కు మంచు ల‌క్ష్మి త‌న కూతురితో క‌లిసి వీడియోలు చేస్తోంది. చిన్నారుల‌కు అర్థమయ్యేలా ఆమె పాఠాలు చెబుతుంది. పిల్ల‌లను ఎలా పెంచాలో, వారిని బాధ్య‌త‌గ‌ల పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలో దాని ద్వారా తెలుపుతుంది. వారిని ఒత్తిడికి ఎలా దూరంగా ఉంచ‌వ‌చ్చో, వారికి అర్థ‌మ‌య్యే రీతిలో విష‌యాల‌ను ఎలా చెప్ప‌వ‌చ్చో మంచు ల‌క్ష్మి త‌న‌దైన శైలిలో వివ‌రిస్తుంది.

మంచు ల‌క్ష్మి ట్వీట్ చేయ‌డంతో దానిపై యూట్యూబ్ సంస్థ కూడా ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ ఆమెకు రిప్లై ఇచ్చింది. ఆ యూట్యూబ్ చానెల్‌ను స‌రిచేయ‌డానికి తాము కూడా ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపింది. దీనిపై స్పందించిన మంచు ల‌క్ష్మి  'వావ్.. థ్యాంక్స్' అని పేర్కొంది.