త్వరగా కోలుకోవాలంటూ ఎన్టీఆర్ కు మహేశ్ ట్వీట్

11-05-2021 Tue 10:55
  • కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్
  • సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న తారక్
  • తారక్ త్వరగా కోలుకోవాలని వెల్లువెత్తుతున్న సందేశాలు
Mahesh Babu praises for good health to Junior NTR

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని తారక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం తారక్ సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరాడు. మరోవైపు తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సందేశాలు పెడుతున్నారు. తాజాగా మహేశ్ బాబు స్పందిస్తూ, 'గెట్ వెల్ సూన్ బ్రదర్. స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్' అని ట్వీట్ చేశాడు.