కరోనా ఎఫెక్ట్... లేట్ అవుతున్న 'పుష్ప' షూటింగ్!

11-05-2021 Tue 10:07
  • కరోనా కారణంగా ఆగిన 'పుష్ప' షూటింగు
  • ఆగస్టు నుంచి అక్టోబర్ కి వెళ్లిన విడుదల
  • పరిస్థితులు చక్కబడగానే సెట్స్ పైకి
Pushpa shooting is balanced for 45 working days

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. బన్నీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా రష్మిక కనిపించనుంది. సుకుమార్ ఎంచుకున్న కథ కారణంగా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికే చాలా సమయం పట్టింది. ఆ తరువాత కరోనా కారణంగా రెండు మూడు సార్లు వాయిదా పడింది. ప్రస్తుతం కూడా కరోనా కారణంగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందనే సందేహం అభిమానుల్లో కనిపిస్తోంది.

ముందుగా అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన షూటింగులో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 30 రోజుల నుంచి 45 రోజుల వరకూ షూటింగు చేయవలసి ఉందట. అనుకున్నట్టుగా చేయగలిగితే టాకీ పార్టు పూర్తవుతుంది. కరోనా ప్రభావం తగ్గగానే సెట్స్ పైకి వెళ్లడానికి టీమ్ రెడీగా ఉంది. బన్నీ .. ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్స్ ను ముందుగా చిత్రీకరించనున్నారు. దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.