ప్రభుత్వం కొవిడ్ మరణాలను దాస్తోంది: మోదీకి కోమటిరెడ్డి లేఖ  

11-05-2021 Tue 06:18
  • రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది
  • మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించండి
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి తప్పుడు సలహాలు
Komatireddy venkat reddy writes letter to modi

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్ కారణంగా వందలాదిమంది చనిపోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టి తప్పుడు నివేదికలు ఇస్తోందని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, కాబట్టి మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని మోదీకి రాసిన ఆ లేఖలో కోమటిరెడ్డి కోరారు.