ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే రైల్వే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి!

10-05-2021 Mon 21:04
  • వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే విభాగం
  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే ఈ నిర్ణయం
  • 2 డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి 7 రోజుల హోం క్వారంటైన్‌
  • నెగెటివ్‌ ఆర్‌టీపీసీఆర్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి కూడా
fourteen day quarantine compulsory for passengers travelling to delhi from telugu states

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. అయితే, 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం పొందినవారు, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్‌ చూపించిన వారికి మాత్రం వారం రోజుల హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.