Teenmaar News: రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్ విధింపుపై నిర్ణయం!

  • రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • లాక్‌డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు
  • సీఎం అధ్యక్షతన రేపు కేబినెట్‌ భేటీ
  • లాక్‌డౌన్‌తో పాటు ఇతర అంశాలపైనా చర్చ
TS Cabinet is going to meet tomorrow to discuus on lockdown

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా కట్టడి నిమిత్తం లాక్‌డౌన్‌ విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే రాత్రిపూట కర్ఫ్యూ మినహా ఎలాంటి కఠిన ఆంక్షలు లేకపోవడం గమనార్హం. దీంతో కొన్ని వర్గాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ విధించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు  సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించాలా? వద్దా? అనే అంశాలతో పాటు మరికొన్ని కీలక విషయాలు సైతం చర్చకు రానున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణలో విధిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News