Pushpasreevani Pamula: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా పాజిటివ్

AP Dy CM Pushpa Srivani and her husband tested corona positive
  • కరోనా బాధితుల జాబితాలో పుష్ప శ్రీవాణి
  • విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకూ కరోనా
  • ఏపీలో ఉద్ధృతంగా కరోనా
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. పుష్ప శ్రీవాణికి, ఆమె భర్త, అరకు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పరీక్షిత్ రాజుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న పుష్ప శ్రీవాణి ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఆక్సిజన్ కొరత, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆలస్యం ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Pushpasreevani Pamula
Parikshit Raju
Corona
Positive
YSRCP
Andhra Pradesh

More Telugu News